నిజం - 12

  • 4.2k
  • 1.7k

నెక్స్ట్ డే మార్నింగ్ విజయ్ మొబైల్ రింగ్ అవుతోంది , లేట్ గా పడుకోవటం పైగా మందు రోజు కూడా అసలు తీరిక లేకుండా ఉండటం తో బాగా నిద్ర పట్టేసింది విజయ్ కి , తన మొబైల్ మూడు సార్లు రింగ్ అయిన తరువాత మెలుకువ వచ్చింది విజయ్ కి , పొద్దున్నే ఎవరు కాల్ చేస్తున్నారు అనుకొని మగత లోనే ఫోన్ తీసి చూసాడు స్క్రీన్ మీద వాళ్ళ అమ్మ పేరు చూడగానే ఫోన్ లిఫ్ట్ చేసి అమ్మా అన్నాడు విజయ్ , ఏంటి అక్కడ అంత బిజీ నా ఫోన్ కూడా చేయడం లేదు నిన్న అంతా వెయిట్ చేశా నీ కాల్ కోసం అంది వాళ్ళమ్మ , నేను ఈ వూరికి రాగానే ఒక సీరియస్ కేస్ వచ్చింది ఆ పనిలో పడి నీకు కాల్ చేయడం కుదరలేదు సారీ అమ్మా అమ్మా అన్నాడు విజయ్