ఈ పయనం తీరం చేరేనా...- 5

  • 8.7k
  • 4.9k

ధరణి వచ్చే సరికే రాత్రి అయ్యింది. చివరి సారి వీరూ కి అన్నం తినిపించి పడుకోబెట్టి తను కూడా కొంచం తిని పడుకోవటానికి వెళ్ళే లోగా ధరణి తల్లితండ్రులు తనతో మాట్లాడాలి అన్నారు...ధరణి ఏమి మాట్లాడ లేదు అలానే వాళ్ళతో పాటు వెళ్లి మౌనంగా వుంది. అది గమనించి ధరణి తల్లి " ఎంటి అమ్మ నీకు మేము అంత పరాయి వాళ్ళం ఐపోయామ..." అని అడుగుతుంది కళ్ళ నిండా నీళ్లతో...ధరణి సమాధానం చెప్పలేదు... మళ్లీ ఆవిడే " నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి ధరణి..." అయిన కూడా ధరణి నుండి ఎటువంటి కదలిక లేదు.ఇంక ధరణి నుండి ఎటువంటి సమాధానం వాళ్లు ఎక్స్పెక్ట్ చెయ్యటం లేదు అందుకే వాళ్లు చెప్పాలి అనుకుంది చెప్పటం మొదలు పెట్టారు... " అమ్మ ధరణి మేము నీకు మొదట చూసిన వ్యక్తి మంచి వాడు కాదు అని తెలిసింది... అందుకని వేరే వ్యక్తి