ఈ పయనం తీరం చేరేనా...- 3

  • 9.2k
  • 5.4k

తను రెంట్ కి వున్న ఇంట్లో ప్యాక్ చెయ్యాల్సిన మిగిలిన వస్తువులు అన్ని ప్యాక్ చేయించి నిన్న జరిగిన సంఘటన కళ్ళ ముందు మేదులు తుంటే అలానే నెల మీద చతికిల పడి ఆ ఆలోచనల్లోకి వెళ్ళిపోయింది ధరణి.నిన్న మధ్యాహ్నం సమయం లో కుట్టు పని కి వెళ్ళిన ధరణి కి వెంటనే ఇంటికి రమ్మని ఎమర్జెన్సీ అని తన తల్లి ఫోన్ చేసే సరికి ఏమైందో ఏమో అని కంగారుగా ఇంటికి వెళ్ళిన తనకి ఎదురుగా హల్ లో నవ్వుతూ మాట్లాడుతున్న తన తల్లితండ్రులు కనిపించిన వెంటనే కోపం వచ్చి కూడా తమాయించుకొని ఫాస్ట్ గా వాళ్ల ముందుకు వెళ్లి " అమ్మ నాన్న ఏమైంది అర్జెంట్ గా రమ్మనారు.." అని కంగారుగా అడిగింది.ధరణి వెనుక వుండి ధరణి నీ కింద నుండి పై వరకూ స్కాన్ చేస్తున్న ఒక 45 నుండి 47 సంవత్సరాలు వుండే వ్యక్తి చూపు