ప్రేమమ్ - 4

  • 10k
  • 4.2k

సాయంత్రం ఇంటికి చేరుకున్న ప్రీతి, తల్లిని తీసుకొని హాస్పిటల్ కి వెళ్ళింది... డాక్టర్ చెప్పిన టెస్ట్ లన్నీ చేయించి రిపోర్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారిద్దరూ..." ఇప్పుడెందుకు తల్లీ ఈ టేస్ట్ లన్నీ నాకు... బానే వున్నాను కదా... చెప్పినా వినకుండా ఇలా వేలు ఖర్చు చేసావ్ నాకోసం... "" ఇప్పటికే ఇంటికి రెంట్ అడ్వాన్స్ అనీ, ఇంట్లోకి కావాల్సిన వస్తువులు, సామాన్లు ఇలా చాలానే ఖర్చులయ్యాయి కదా... మళ్ళీ ఇవి కూడానా... "" అమ్మా...!! నాకు నీ హెల్త్ కన్నా, ఇంకేం ముఖ్యం కాదు... కాసేపు మాట్లాడకుండా కూర్చో.... " " హుమ్మ్... మొండి పిల్లవి.. చెప్పినా వినవు కదా... "నర్స్ వచ్చి పిలవడంతో, ఇద్దరూ డాక్టర్ గారి క్యాబిన్ లోకి వెళ్తారు...డాక్టర్ రిపోర్ట్స్ చూసి, రాసిచ్చిన మందులు తీసుకొని, బయల్దేరారు ఇద్దరూ...ఆటోలో వస్తూ, మార్కెట్ దగ్గర ఆగి, కావాల్సిన కూరగాయలు తీసుకొని ఇంటికి బయల్దేరుతారు..." ప్రీతి...!! కాలేజ్ ఎలా వుంది...