ప్రేమమ్ - 2

  • 7.5k
  • 3.9k

భారంగా అనిపిస్తున్న కనురెప్పలను నెమ్మదిగా తెరిచింది ఆమె...కరస్పాండెంట్ వైష్ణవి గారు, ప్రీతి చేతిలో చెయ్యి వేసి," అమ్మా ప్రీతి..!! ప్రీతి ఆర్ యూ ఓకే...!? " అని అడుగుతారు...చెమ్మగిల్లిన కళ్ళతో వైష్ణవి గారిని చూస్తూ, తల నిలువుగా ఊపుతుంది ప్రీతి...ప్రీతి తల నిమురుతూ, ఆమె పక్కనే కూర్చోని జరిగింది చెప్తారు వైష్ణవి గారు... ఆవిడ చెప్పింది మొత్తం విన్న ప్రీతికి తనే అధర్వ్ విషయంలో ముందుగా తప్పు చేశానని అర్థం చేసుకుంటుంది...ఈలోగా ప్రీతిని వుంచిన రూంలోకి వస్తారు ఆ కాలేజ్ ఫౌండర్స్ లో ఒకరైన ధర్మేంద్ర... ఇంకా ప్రిన్సిపల్ విష్ణు మోహన్ కలిసి...నెమ్మదిగా లేచి కూర్చుంటూ, ప్రిన్సిపల్ విష్ణు మోహన్ ని చూస్తూ చిన్నగా నవ్వి, వచ్చిన వాళ్ళని విష్ చేస్తుంది ప్రీతి..." అమ్మా ప్రీతి... ఈయన అక్కినేని ధర్మేంద్ర గారు... ఈ కాలేజ్ ఫౌండర్... " ధర్మేంద్ర గారిని పరిచయం చేస్తారు విష్ణు మోహన్..." సర్..!! తినే ప్రీతి... "