తనువున ప్రాణమై.... - 3

  • 4.6k
  • 2.2k

ఆగమనం.....అద్భుతంగా అజంతా శిల్పాన్ని పోలిన అందంతో, ప్రపంచమంతా వెతికిన దొరకనంత సౌందర్యరాశి అని అయితే చెప్పలేము కానీ, మన పక్కింటి అమ్మాయిల అనిపిస్తూ, అబ్బాయిలు పడి పడి చూసేంత అందమైన ఆడపిల్ల అని మాత్రం చెప్పొచ్చు.తన సెలెక్ట్ చేసుకున్న లెహంగాలను, అద్దం ముందు నిలబడి తనకి ఎలా ఉన్నాయా? అని.... తనకేసి పట్టుకొని అటు, ఇటు కదులుతూ చెక్ చేసుకుంటుంది.మీకు ఈ కలర్, చాలా బాగా నప్పింది మేడం.తనకి కితాబు నిచ్చిన సేల్స్ గర్ల్ ని చూసి అందంగా నవ్వుతుంది.ఇది నాకు, బాగా సెట్ అయిందా..??ఎస్ మ్యామ్, చాలా బాగుంది..!!ఉమ్మ.... పెదవులు రౌండ్ గా ముడిచి, అద్దంలో తనకు తానే ఒక ఫ్లైయింగ్ కిస్ ఇచ్చుకుంటుంది.ఆ అమ్మాయి ఆనందం చూసి, సేల్స్ గర్ల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ లెహంగా ఆమె తీసేసుకుంటుంది; అన్న కాన్ఫిడెంట్ తో.అవును మిస్, ఇది బాగుంది. మరి అది..?? అంటూ, అంతకు ముందు చెక్ చేసుకుని,