నిద్ర పట్టని ఓ రాత్రి! విసిగిస్తోంది నను లీలగా!కుదురుగుండని పసిపాపల, మసలుతున్న మంచం మీదగా!కంటి రెప్పల పై ఊహల యుద్ధమేదో జరుగుతుంది. కనుమరుగయ్యే దృశ్యాలు 'వంద 'వచ్చుంటాయి.ఆ క్షణాల్లో! ఉన్నట్టుండి చిమ్మ చీకటంతా కమ్ముకుంది. ఆలోచనలన్నీ పారిపోయాయి.ఆ చీకటి లోంచి మెరుపులా మెరుస్తూ నిండు చందమామ వెలుస్తుంది. దాని చుట్టూ దిష్టి చుక్కలు పెట్టినట్టు చుక్కలన్ని మెరిసిపోయాయి. దూరంగా ఉన్న అలలన్నీ దిష్టి పెట్టడానికై దాని దగ్గరికి చేరడానికి ఎగసిపడుతున్నాయి.ఇదంతా కళ్ళకు కట్టినట్టు అలా మెత్తటి ఇసుక పాన్పుపై నడుము వాల్చి చూస్తూ ఉండిపోయాము. నువ్వు ,నేను అలా! మన కింద నలిగి ,మలిగైపోతున్న ఆ ఇసుకకు. ఎంత విసుగొచ్చిందో, ఎంత గునుక్కుంటూ మోసిందో మన బరువుని. దానికే తెలియాలి?అయినా అవేవీ మనకు పెద్దగా పట్టనట్టు ఆ వెన్నెలలో లీనమైపోయాం ఇద్దరుo.నిండు వెన్నెల ,పండు వెన్నెలలా ఉంది. కోసుకొని తినేద్దాం అన్నంత కసి పుట్టుకొస్తోంది . ఎన్ని చుక్కలు ఉన్నాయో అని