ఓం శరవణ భవ - 9

  • 4.2k
  • 1.8k

          మహేశ్వరుడు పరంధాముని  కధనం ద్వారా ఈ విడ్డూరం తెలుసుకొని కుమారుని వారింప  స్కందగిరిని దర్శిస్తాడు .  తండ్రి ఆగమనం  తనయునకు పరమానందభరితమవుతుంది .  జనకుని ఆనతి మేరకు స్కందుడు సృష్టి కర్తను  బంధవిముక్తుని చేస్తాడు .  అజ్ఞానం తొలిగిన  బ్రహ్మదేవుడు  వినయశీలుడై , తన తప్పును గ్రహించి శివకుమారునకు  శరణాగతుడవుతాడు .    తండ్రికి  తనయుడి పాండిత్య ప్రకర్ష తెలుసుకోవాలన్న పితృసహజమైన  ఉబలాటం  మదిని జనిస్తుంది .  పరాత్పరుడు ప్రణవ రహస్యం వివరించమని షణ్ముఖుని  ఆదేశిస్తాడు .  మంత్ర  రహస్యం  బహిర్గతం చేయటం  పధ్ధతి కాదు  గనుక  బాలుడైనా తాను గురు స్థానం లో ఉండి   జగదీశ్వరుడికే  తారక మంత్రం  వివరించాలనుకుంటాడు  సుబ్రహ్మణ్యుడు .  తండ్రిని మించిన తనయుడి ఆలోచన  అభయంకరుడికి  ఆమోదయోగ్యం అవుతుంది .     నేటి ‘ కుంభకోణం’  పట్టణానికి  చేరువై యున్న ‘ స్వామి మల’ అను క్షేత్రమున  సుబ్రహ్మణ్యుడు  సదాశివునకు