ఓం శరవణ భవ - 8

  • 4.8k
  • 1.8k

              షోడశ కళలకు  ప్రతిరూపం గా   పదహారు ఆకృతులలో  , తన సంకల్పమునకు  తగిన గుణ రూప .విశేషాదులతో  వెలసిన  కుమార స్వామి  పరిపూర్ణ అవతార పురుషుడు .  ఈ రూప వైవిధ్యం  కాదు ఆసక్తికరం . జ్ఞాన మోక్ష దాయకం .    నిప్పు రవ్వ కైనా, నిటలాక్షుని జ్వాలకైనా  దహనగుణం ఒక్కటే .  ధర్మం లో ఏమాత్రం తేడా ఉండదు .  ఇదే పోలిక  సుబ్రహ్మణ్యుని  విషయం లోనూ , సదాశివుని విషయం లోనూ వర్తిస్తుంది .  బాలుడైనా,  కార్తికేయుడు  పరిపూర్ణ అవతార పురుషుడు .  పరాత్పరునకు  ఏమాత్రం  తీసిపోడు  .   కానీ, మాయామోహితులైన దేవతలు  ఈ సత్యం గ్రహించక  షణ్ముఖుని శక్తి యుక్తుల విషయం లో  సందేహాలు వ్యక్తం చేస్తారు .     శివకుమారుని  బాల్య క్రీడలు  వినోద , విస్మయ భరితములై  తల్లిదండ్రులనే కాక కైలాసవాసులందరినీ ముగ్ధులను