జతగా నాతో నిన్నే - 26

  • 4.3k
  • 2.1k

రాహుల్ చూపు షాప్ ముందు ఉన్న దానిపై పడింది . అది రాత్రి అవ్వటం వల్ల పెద్దగా జనాలు ఎవ్వరూ లేరు. అది ఒక స్వీట్ షాప్. దాని యజమాని బయటికి వచ్చి “ పనికిమాలినదాన ....” అంటూ కాలితో కుక్కని తంతున్నాడు. అది బాధగా “ కుయ్యో ......మోర్రో .....” అంటూ అరుస్తుంది . “ నువ్వు ఇలా చెప్తే అసలు ఎందుకు వింటావే? నా షాప్ ఒకటే నీకు కనిపిస్తుందా? వేరే ఏది కనిపించదా? ” అంటూ రాడ్ తీసుకోని విసిరాడు. అది నేరుగా వెళ్లి ఆ కుక్క వెనక కాలికి తకింది. దానితో నొప్పి ఎక్కువ అయ్యి గట్టిగా అరిచింది కుక్క. దాని కాలివెంట నుంచి రక్తం చిన్నగా కారుతుంది . అది చూడగానే రాహుల్ కి ఆ వ్యక్తి పైన చాలా కోపం వస్తుంది. వెంటనే ఆ కుక్కని చేరుకొని దాన్ని పైకెత్తుకుంటాడు . “