జతగా నాతో నిన్నే - 23

  • 4k
  • 2k

రాహుల్ ఆ ఇంటి ప్రస్తావని తీసుకొని రాగానే “ ఏంటి నిజమా ....? ” అంటూ అందరూ ఒక్కసారిగా అన్నారు. అవును నిజమే అంటూ తల ఊపుతూ. ...అన్వి వైపు చూశాడు. తను ఏం మాట్లాడకుండా మౌనంగా తన రూమ్ వైపుకి నడిచింది . అలా ఎందుకు ప్రవర్తిస్తుందో.......అర్థం కాక గీత , సంజన ఇద్దరు అలాగే చూస్తూ ఉండిపోయారు . “ సరే అయితే రేపు ఆ స్థలాన్ని చూద్దాం. ఇంకా రేపే మన ఆర్గనైజేషన్ ని అందంగా రెడీ చేద్దాం ” అన్నాడు నవ్వుతూ. దానికి అందరూ ఒప్పుకున్నారు . ఆ తర్వాత అక్కనుండి అభయ్ నేరుగా సెయింట్ చర్చ్ కి వెళ్ళాడు . “ నేను వచ్చేసాను.....” గట్టిగా అంటూ డోర్ తీసుకొని చెప్పాడు. “ ఏంటి ఈ రోజు చాలా అంటే చాలా సంతోషంగా కనిపిస్తున్నావు? ” అంటూ అప్పుడే ప్రార్థన పూర్తి చేసుకున్న పోప్