జతగా నాతో నిన్నే - 03

  • 5.2k
  • 3k

వారి వెనుక ఒక అబ్బాయి నిలుచున్నాడు. అతడు పవన్ కళ్యాణ్ లాగా తలపై కొద్దిగా మధ్య పాపిడి తీసి ఉన్న తన హెయిర్ ని సరి చేసుకుంటున్నాడు . అతని వెంట్రుకలు నల్లని రంగుతో చూడగానే అట్రాక్టివ్ లుక్ లో ఉన్నాయి .ఇంకా కనుబొమ్మల పైన ఉన్న ఆ నల్లని వెంట్రుకలు,అస్సలు గ్యాప్ లేనట్టుగా లైట్ గా కలిసిపోయాయి . అతనిను దాదాపు పిల్లిలాగా నీలిరంగు కళ్ళతో కనిపించాడు. తన బుగ్గల పైన ఉన్న అందమైన సొట్టబుగ్గ సూర్యుని కాంతి కారణంగా ముత్యంలా మెరుస్తుంది . అతడు వేసుకున్న తెలుపు రంగు స్వెటర్ లాంటి కోటుని ,దానిపై మోస్తున్న బ్యాగుని ,అతడి మైంటైన్ చేస్తున్న తన స్టైల్ ని చూడగానే ముగ్గురు ఫిదా అయిపోయారు . ఇంకో ఆశ్చర్యకర విషయం ఏంటంటే అప్పటిదాకా మాట్లాడుకుంటున్న అమ్మాయిలు అందరూ ,తన వెనక ఒక పెద్ద సైన్యంలా ఫాలో అవుతున్నారు. వాళ్లందరి కళ్ళలో అసూయ