జతగా నాతో నిన్నే - 02

  • 6.4k
  • 4.1k

ఉదయం ఆరు గంటలు అప్పుడే రెస్టారెంట్ ఓపెన్ చేసి దాని లోపల అంతా క్లీన్ చేసి చెత్తను బయటపడేయటానికి వచ్చాడు ఓనర్ .అక్కడ ఏదో చెడు వాసన రావడాని గుర్తించాడు . “ ఏంటి ఎప్పుడు లేంది ,ఇంత దుర్వాసన వస్తుంది ” అంటూ ముక్కు పుట్టలని మూసేస్తూ ముందుకు కదిలాడు . అక్కడ కనిపించిన దృశ్యానికి ఒక్కసారి భయపడిపోయి కిందపడ్డాడు. ఏదో తరుముతున్నట్టుగా భయపడుకుంటూ అక్కడ నుంచి రోడ్డు పైకి వచ్చాడు. వెంటనే తన చోక్క జోబుని తడుముకొని అందులో ఉన్న ఫోన్ ని ఓపెన్ చేసి పోలీసులకు ఫోన్ చేశాడు. ******* సూర్యుడికిరణాలు కిటికీలో నుంచి నేరుగా బెడ్ పైకి పడ్డాయి .ఆ వెచ్చదనంతో నిద్రమత్తు కూడా పారిపోయింది . బద్దకంగా వల్లూవిరిస్తూ లేచింది మన హీరోయిన్. “ అబ్బా అప్పుడే ఏడు అయిపోయిందా? ఇంత పొద్దు పొద్దున్నే వచ్చి ఏం చేస్తావయ్యా నువ్వు? మా నిద్ర చెడగొట్టడానికి