ఓం శరవణ భవ - 1

  • 16.8k
  • 5.2k

కార్తికేయ చరితము కుమార గాధా లహరితొలి పలుకులుకార్తికేయుడని, షణ్ముఖుడని ఉత్తరాపథం లోను, సుబ్రహ్మణ్యుడు, మురుగన్, ఆర్ముగం అని దక్షిణ దేశం లోను కొలువబడుచున్న శివ" కుమారుడు అశేష జనావళికి జ్ఞాన ముక్తి ప్రదాత.వ్యాస ప్రోక్తమై, అష్టాదశ పురాణాల లో ఒకటైన" శ్రీ స్కాంద పురాణం " ప్రామాణికంగా సుబ్రహ్మణ్యుని చరితము ను వివరిస్తుంది. అంతేగాక, శివ, అగ్ని పురాణాలలో కూడా సందర్భోచితంగా కుమార గాధను ప్రస్తావించారు. ఇక కుమార సంభవం" షణ్ముఖుని కమనీయ గాధను కావ్యాత్మకంగా ప్రబోధించింది. దక్షిణ భారతంలో కాశ్యప శివాచార్యుని ( కచ్చియప్ప. అన్నీ నామంతో తమిళులు వ్యవహరిస్తారు. ) 'కంద పురాణం ' దేశీయత, విచిత్ర కధా సంవిధానం తో పండిత, పామర జనరంజకమైంది.పై గ్రంధాలన్నింటి సారమైన " శ్రీ స్కాంద పురాణ సారామృతం " నేటి కథా సంగ్రహమునకు మూలం. సంస్కృత దేశీయ భాషల్లోని ముఖ్య గ్రంధములను అవలోకించి, సారాన్ని గ్రహించి, శ్రీ నటరాజన్ ,