నీడ నిజం - 6

  • 3.9k
  • 1.9k

ఇప్పుడు ఆమె కలల్లో అస్పష్టత తొలగి, కొన్ని స్పష్టమైన రూపాలు , ప్రదేశాలు కనిపించసాగాయి. అ వివరాల ప్రకారం ఆమె మనసులో మెదిలే ప్రదేశాలు, పరిసరాలు, భౌగోళిక స్వరూపం రాజస్థాన్ రాష్ట్రానివని భరత్ రామ్ గుర్తించాడు. విశాల రాజస్థాన్ లో ఆమె వర్ణించే ప్రదేశాలు ఎక్కడని వెదకటం ? వెంటనే భారత్ రామ్ కు ఓ రాజస్థాన్ మిత్రుడు గుర్తుకొచ్చాడు.అతడే శాంతిలాల్ .వృత్తిరీత్యా వ్యాపారస్తుడు. రాజస్థాన్ లో మూల మూల పరిచయం వుంది. భరత్ రామ్ అతడిని సంప్రదించాడు. విద్యాధరి కధనం సాంతం విన్నాక శాంతిలాల్ మనసులో రెండు ప్రదేశాలు మెదిలాయి. అ రెండు ప్రదేశాలు గ్రామీణ వాతావరణం లో ఉన్నవే. భరత్ రామ్ అన్ని కోణాల్లో సమస్యను పరిశీలించాక ఒక నిర్ణయానికి వచ్చాడు. అయన సూచన ప్రకారం సాగర్, విద్యాదరి ఒకసారి రాజస్థాన్ లో కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు సందర్శించాలి. ఇందువల్ల విద్యాధరి సమస్యకు ఒక బ్రేక్ త్రూ వస్తుంది.