తన ప్రేమకై - 2

  • 23.2k
  • 9.3k

చంద్రశేఖర్ ఎంత నచ్చచెప్పిన ఉమ మనసు కుదుటపడలేదు..ఎంతైనా తల్లీ మనసు కదా! రాను రాను హరిణి మరీ దారుణంగా తయారయ్యింది.. మొఖంలో ఏ భావం లేకుండా మౌనంగా ఎప్పుడూ తనే తన ప్రపంచం అన్నట్టు.. ఎవరితోనూ ఏ సంబంధం లేనట్టు ఆ గదికే అంకితమయిపోయింది..ఒకప్పుడు హరిణికి, ఏడుపుకి పడదు.. ఇప్పుడు ఆ ఏడుపే తన సహచరి..ఎల్లప్పుడూ తనని అంటిపెట్టుకునే ఉంటుంది..తనకేంతో ఇష్టమైన జాబ్ విషయమే మర్చిపోయింది.. అసలు జీవితమే గుర్తులేనప్పుడు, ఇంకా జాబ్ నీ ఏం గుర్తుపెట్టుకుంటుంది..ఉండే కొద్ది తనకి తానే నచ్చకుండా పోయింది..హరిని అలా చూస్తుంటే ఉమ కడుపు తరుక్కుపోతుంది.ఎందుకో ఏంటో ఏమి తెలియదు.. కానీ బిడ్డ దేనికో బాగా క్రుంగిపోయింది.. ఏమైయ్యుంటుంది అన్న ఆలోచనలో తన ఆరోగ్యం పూర్తిగా పాడయిపోయింది..బీపీ పెరిగిపోయి ఉన్నట్టుండి హార్ట్ స్ట్రోక్ వచ్చేసింది..24 గంటలు గడిస్తే కానీ ఏం చెప్పలేమన్నారు డాక్టర్లు.. తల్లీ పరిస్థితి చూసి హరి దుఃఖం రెట్టింపయ్యింది..వాళ్ళని అలా చూసి కూడా