నీడ నిజం - 3

  • 5.4k
  • 2.7k

తనేం తప్పుగా ఆలోచించడం లేదు కదా. సాగర్ తల్లి ఎందుకు ఎప్పుడూ తనకు వ్యతిరేకంగా ఆలోచిస్తుంది . సాగర్ వైఖరి ఆమెకు అసలు నచ్చలేదు .తల్లి పై ప్రేమ ,"అనవసరం గా అమ్మని అనకు . ఆమె చెప్పిందని ఈ పని మానుకోలేదు . వేరే కొత్త వెంచర్ ప్లాన్ చేసాము . పేపర్ వర్క్ జరుగుతున్నప్పుడు పెద్దగా నాకు పని ఉండదని ఎజ్ద్ హోం ప్రాజెక్ట్ టేకప్ చేశాను . ఈ లోపలే మన న్యూ వెంచర్ బ్యాంకు లోన్ శాంక్షన్ అయింది . పని ప్రారంభించాము . అందుకే ఎజ్ద్ హోం ప్రాజెక్ట్ వాలంటరీ ఆర్గనైజేషన్ కు అప్పగించాను .అప్పుడప్పుడు సూపెర్వైస్ చేస్తే చాలు . .... ఈ విషయాలన్నీ నీకు తెలుసు . తెలిసి కూడా ఎందుకంత ఎమోషనల్ గా నన్ను అరుస్తావ్?”అతడు చెప్పిన కారణం విద్యాధరిని సమాధాన పరచ లేకపోయింది . ఆమె అసహనం గా