Journey - without boundaries - Episode 1

  • 9.8k
  • 1
  • 4.2k

చుట్టూ మంచు కొండలు తెల్ల రంగు తెచ్చి ఈ కొండల మీద పెయింట్ చేసారా అనేంత తెలుపు మధ్య లో నదిల ఒంపులు తిరుగుతూ వెళ్తున్నా రోడ్డు, అలాంటి రోడ్డు మీద బులెట్ వెళ్తుంది , అది చూడడానికి ఒక ట్రవెల్లెర్ బండి లా ఉంది. వెనుక రెండు బ్యాగులు , పెట్రోల్ నింపి ఉన్న క్యాన్ , బైక్ ముందు భాగం లో "don't put boundaries for your life" అనే కొటేషన్ ఇంతకీ ఈ బైక్ మీద ఉన్నది ఎవరు అనేది చూస్తే ప్రియా తను ఒక ట్రవెల్లెర్ ఈ ప్రపంచం మొత్తం క్యాంపర్ వ్యాన్ లో తిరుగుతూ ప్రక్రుతి లో ఉన్న ప్రతి అనుభవాన్ని ఆస్వాదించాలి అనేది తన కోరిక తనకి వాళ్ళ నాన్నే స్కూల్ కాలేజ్ అన్ని తను ఇప్పటివరకు స్కూల్ కాలేజ్ ఎలా ఉంటాయో కూడా చూడలేదు నేచర్ ని ఇంత ప్రేమించే