చిరుదివ్వె

  • 12.7k
  • 4k

చిరుదివ్వె °°° °°° సాయంత్రం ఏడు అవుతున్నా ఆ ఇంట్లో దీపాలు వెలగలేదు. దీపం వెలిగించాల్సిన వ్యక్తి దీనం గా మంచం మీద కూర్చుని ఉంది. విచారానికి నిలువెత్తు రూపం లా ఉంది ఆమె. జుట్టు విరబూసుకుని, రెండు కాళ్ల మధ్య తలని పెట్టుకుని ఉంది. మనసులో కొండంత దుఃఖం ఉన్నా అదేంటో కళ్ళమ్మట నీరే రావడం లేదు... ఏడ్చి ఏడ్చి ఇంకిపోయాయేమో మరి. వారం క్రితం సంతోషానికి చిరునామాల ఉన్న తను ఈ రోజు దుఃఖానికి ప్రతీకగా నిలిచింది. భర్త తో ఆనందం గా జీవిస్తున్న తన జీవితాన్ని చీకటి లోకి నెట్టి దేవుని దగ్గరికి వెళ్లిపోయాడు తన భర్త ధీరజ్. “దీపా...దీపా” అంటూ వెనకాలే తిరిగే తన భర్త వారం క్రితం ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు వెనుక నుంచి వస్తున్న లారీ డ్రైవర్ గుద్దడం తో స్పాట్ లోనే చనిపోయాడు. ధీరజ్ కీ, దీపా కీ నా అన్న వాళ్ళు