ఆ ముగ్గురు - 13 - లక్కవరం శ్రీనివాసరావు

  • 6.2k
  • 2.3k

పెంట్ హౌస్ చిన్నదైనా పొందికగా, సౌకర్యం గా ఉంది. అనంత్ రామ్ ఆ గదిని చాలా శుభ్రంగా ఉంచుతాడు. చాలా సాదాసీదాగా ఉన్న ఆ గదిలో ఒక ట్రంకు పెట్టె. దాని ప్రక్కనే బోషాణం లాంటి చెక్కపెట్టె. ఆ పెట్టె కు ఎప్పుడూ తాళం వేసి ఉంటుంది. గదికి ఒక వైపు దండెం.పైన వేలాడుతున్న గుడ్డలు. ఓ ప్రక్క చక్కగా అమర్చిన వంటసామాను. చిన్న గ్యాస్ స్టౌ.ఒక మడత కుర్చీ. ఒక ప్లాస్టిక్ నవారు మంచం. ఫక్తు బ్రహ్మచారి నివాసం. ఓ మూల చిన్న స్టూల్.దానిమీదకృష్ణ విగ్రహం. బేలూరు శిల్పం. అనంత్ రామ్ స్నానం చేసి శుభ్రం గా ఉన్నాడు. గడ్డాలు మీసాలు లేవు . నున్నగా షేవ్ చేసుకున్నాడు . పైకి దువ్విన క్రాఫ్. విశాలమైన నుదుటిపై మెరుస్తున్న సింధూరపు రేఖ . ఎడమ కనుబొమపై వెంట్రుకల్లో కలిసిపోయే పాత గాయం తాలూకు మచ్చ. చిరుత కదలికలు . చురుకైన