నాన్నకు ప్రేమతో శ్రావ్య

  • 15.7k
  • 1
  • 4.8k

అమ్మ నన్ను క్షమించు యిలాంటి సమయంలో నిన్ను ఒంటరిగా వదిలేస్తున్నాను. ప్రతి క్షణం నరకం అనుభవిస్తు బతకడం నా వల్ల కావడం లేదు. తప్పు ఎవ్వరో చేస్తే శిక్ష నకు పడింది. అందరూ నేనేదో తప్పు చేసినట్లు చూస్తున్నారు. నాన్నని వాళ్లు మోసం చేసారు. ఆస్తి పోయినా భరించాను. కానీ అస్తి తో పాటు నాన్న కూడా పోయారు. అప్పులు మిగిలాయి. కానీ అయినా వాళ్లు దూరం అయ్యారు. ప్రేమించినవాడు మోసం చేసాడు. నాకు ఇంకా బతకాలి అని లేదు నన్ను క్షమించు అమ్మా! ఇట్లుమి శ్రావ్యకళ్ళు ధారాపాతంగా వరిషించసాగాయి. మనసును ఎవరో మెలిపెడుతునట్టు బాధ. కానీ అమ్మ కోసం అయిన సరే బతకాలినీ ఉన్నా బలవంతంగా ఎవరో ఊపిరి అపెస్తునట్లు ఉంది. బతుకు భారంగా ఉంది. గడిచిన జివితం అంత ఒక్కసారిగా కళ్ళ ముందు కదిలింది. గడిచిన కాలం తిరిగి రాదనే నిజం మనసు అంగీకరించడం లేదు.