అక్షరాకృతి

  • 13.8k
  • 3.4k

ఎప్పుడూలాగానే కాలేజీకి వెళ్ళడానికి తయారవుతోంది అక్షర "ఏక్కడికే బయలుదేరుతున్నావు" అక్షరను అడిగింది అక్షర తల్లి. "ఇంకెక్కడికమ్మా... కాలేజీకే" చెప్పింది అక్షర “నువ్వేమీ కాలేజీకి వెళ్ళక్కర్లేదు...ఇంత జరిగాక కాలేజీకి వెళ్ళటానికి నీకు సిగ్గు అనిపించటం లేదు". "అమ్మా...ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావు. ఏ తప్పూ చేయని నేను ఎందుకమ్మా సిగ్గు పడాలి. తప్పు చేసింది వాళ్ళు. వాళ్ళు సిగ్గు పడాలి" "నువ్వేమీ తప్పు చేయ లేదా? మరైతే నిన్న, మొన్నా మనందరికీ జరిగిందంతా ఏమిటి ? గొంతుచించుకొని అరిచింది తల్లి.. నిద్రలో నుండి ఉలిక్కిపడి లేచి కూర్చుంది మానస మొహానికి పట్టిన చెమటని తుడుచుకుంది " ఏంటో ఈ జ్ఞాపకాలు నన్ను ఎప్పటికి వదిలిపోతాయో ఏంటో.?" అనుకొంటూ లేచి వంట గదిలోకి వెళ్ళింది వంటింట్లో కూరగాయలు కట్ చెయ్యడం మొదలుపెట్టింది మానస 'అలూ...బైంగల్...సబ్జీ'- ప్రతి రోజూ సరిగ్గా ఉదయం పదకొండు గంటలకు ఖంగుమని వినిపిస్తుంది కూరగాయలమ్ముకునే తాత గొంతు. ఆ రోజు ఆ గొంతు