రంగుల ఎడారి

  • 18.6k
  • 3.8k

“నెమలి కంఠం లాంటి రంగు ఈ టారకాయిస్ రాయిది. ఇది ధరిస్తే మీ కంఠం కూడా అంతే అందంగా కనిపిస్తుంది.ఓహో ఇదా, ముదురు కాఫీ రంగులో ఉన్న ఇది టైగర్ ఐ, ఇది ధరిస్తే మీరు కూడా పులి లాగా శక్తివంతంగా కనిపిస్తారు..ఈ తెల్లటి రాళ్ళని మూన్ స్టోన్ అంటారు, ఇది ధరిస్తే మీరు కూడా చందమామ అంత స్వచ్చంగా అనిపిస్తారు, మనసు ప్రశాంతంగా ఉంటుంది”ఇలా ఒకొక్క రాయి గొప్పదనాన్ని వివరిస్తూ, పర్యాటకులతో రంగురాళ్ళు కొనిపించటమే నా ఉద్యోగం.“మీకు తెలుగు ఇంత బాగా ఎలా తెలుసు?” అని అడుగుతారు.పుట్టింది తెలుగు నేల మీదే. ఇంటర్ చదివాక, తెలిసిన వాళ్ళు అని నాన్న రాజస్థాన్లో స్థిరపడ్డ బంధువుల అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేశారు.. మా ఆయనకు అంత డబ్బులు లేకపోవచ్చు కానీ బాగా మనసున్నవాడు, నన్ను ప్రాణం గా చూసుకునేవాడు.ఆయన రంగురాళ్ళ క్వారీలో పని చేసేవాడు. వీటి గురించి ఆసక్తి అలాగే మొదలయ్యింది.అందరికీ