ఆకాంక్ష

  • 20.8k
  • 2
  • 5.3k

ఓ ప్రశాంతమైన పార్కు… ఉదయం 6 – 6:30 మధ్య ప్రాంతం! అక్కడ కొంతమంది యోగా చేస్తున్నారు, ఇంకొంతమంది షటిల్ ఆడుతున్నారు, మరికొంతమంది వాకింగ్, జాగింగ్ వంటివి చేస్తున్నారు. ఓ ఇద్దరు వ్యక్తులు ఏదో మాట్లాడుకుంటూ, నడుస్తూ ఉంటారు. అందులో ఒకరు మానసిక వైద్యులు డా.సంజయ్, మరొకరు ఒక పీజీ స్తూడెంట్ మనోజ్. ఒకరినొకరు పరిచయం చేసుకున్నాక, ఒక బెంచ్ మీద కూర్చుంటారు. “మిమ్మల్ని కొద్దిరోజులుగా గమనిస్తున్నాను. మీరు రోజూ పార్కుకి వచ్చి, అదే పనిగా నన్ను గమనిస్తున్నారు. మీ సమస్యనేదో నాతో చెప్పుకోవడానికి చూస్తున్నారని నాకనిపించింది. కానీ, నాకది చెప్పడానికి ఎందుకో సంకోచిస్తున్నారు. కాబట్టి, మీరేం చెప్పాలనుకుంటున్నారో ధైర్యంగా నాతో చెప్పండి, ఏంటి మీ సమస్య?” అని మనోజ్ ని ఎంతో సావధానంగా అడుగుతారు డా.సంజయ్. అందుకు మనోజ్ ఎలా చెప్పాలి? ఎలా మొదలుపెట్టాలి అనే సందిగ్ధం నుండి మెల్లగా బయటపడుతూ “సమస్య నాది కాదు సర్, నా చెల్లిది!”