మనస్ పూర్తిగా!

  • 22k
  • 2
  • 4.5k

ఒకతను, మండుటెండలో, ఒక నిర్మానుష్య ప్రదేశంలో ఎవరో వెంటాడుతున్నట్టుగా పరుగులాంటి నడకతో వేగంగా ముందుకి వెళ్తున్నాడు. "ఇకనైనా ప్రాక్టికల్ గా ఆలోచించరా...", "నీకు నిలకడ లేదు!", "నువ్వు కష్టపడలేవు!", "you don't have enough experience", "we will get back to you soon...", "we will let you know!", "నువ్వు చాలా ఎక్కువ అడుగుతున్నావు!", "you are talented but...", "ఎన్నాళ్ళురా ఇలా?", "నీకంటూ ఓ క్లారిటీ ఉందా?", "మూడు పుస్తకాలు రాసావు... ఏం ప్రయోజనం?", "నువ్వు అన్నీ బానే రాయచ్చు, కానీ నీకు పేరు, గుర్తింపు వచ్చేసరికి నీకో నలభై ఏళ్ళు వస్తాయి!", "seriousness లేదురా నీ దగ్గర అస్సలు!", "మీ వాళ్ళు చెప్పినట్టు ముందు వేరే ఏదైనా ఉద్యోగం చేసుకోరా...", "నీకిష్టమైన పనే అయినా, కష్టమైతే చేయవు!", "ఏంటోరా... నువ్వేంటో మాకర్థం కావట్లా...", "మీ వాడు ఏం చేస్తున్నాడని అడిగినప్పుడల్లా ఏం చెప్పాలో తెలీక,