అరుణ చంద్ర - 5

  • 11.4k
  • 3.6k

రచయిత : బివిడి ప్రసాదరావు ఎపిసోడ్ 5 ఆదివారంతో కూడి వరసగా మూడు పబ్లిక్ హాలిడేస్ రావడంతో, కృష్ణమూర్తి చొరవతో, లక్ష్మి, అరుణ, చంద్ర లాంగ్టూర్కు బయలుదేరారు. ఇక్కడకు అని అనుకోలేదు వారు. కానీ, కారులో బయలుదేరారు, సైట్సీయింగ్కు అన్నట్టు. లక్ష్మికి తప్పా, ఆ ముగ్గురూ కారు డ్రయివింగ్ చేయగలరు. కనుక, ఓపిక మేరకు ముందుకు వెళ్తూ, చూడవలసిన వాటి దగ్గర ఆగుతూ, లేదా, బడలిక అనిపిస్తే, హోటళ్లులో బస చేస్తూ ఈ సెలవుల కాలం గడిపేసేలా ఒక ఆలోచన మాత్రం వారిలో ఉంది. అదే ప్రస్తుతం కొనసాగుతోంది.అరుణ కారు డ్రయివ్ చేస్తోంది. తను ఎప్పుడూ 60కి 70కి మధ్య స్పీడుతోనే డ్రయివింగ్ చేస్తోంది. అదే జరుగుతోంది ప్రస్తుతం.అరుణ పక్కన లక్ష్మి ఉంది. వెనుక సీట్లలో కృష్ణమూర్తి, చంద్ర కూర్చున్నారు.వారంతా చక్కగా సంభాషించుకుంటున్నారు.కారులో మ్యూజిక్ప్లేయర్లోంచి సరళంగా శాస్త్రీయ సంగీతం వస్తోంది."మామయ్యా రాత్రి నేను, అరుణ ఒకటనుకున్నాం. అది మీతో మాట్లాడాలను కుంటున్నాను"