అప్రాశ్యులు - 11

  • 7.4k
  • 2.5k

అప్రాశ్యులు భీమేశ్వర చల్లా (సి.బి.రావు) 11 ఆరోజు సాయంకాలం సనల్ విశాల ఇంటికి వచ్చి తలుపుతట్టి తలుపు తెరచివుంది, తలుపు తోసుకొని లోపలికి వెళ్ళాడు. విశాల వంటరిగా కూర్చుని కిటికీలో నుంచి పరధ్యానంగా బయటకు చూస్తూంది. విశాలా, అనే పిలుపు దగ్గరలో వినబడి త్రుళ్ళిపడింది.సనల్ ని చూచి వెంటనే లేచి నిలబడి కంగారుగా “మీరా?” అంది. “అవును నేనే విశాలా, వంటరిగా ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు” అన్నాడు. “విశాలా నేను డాక్టరునని మరచిపోయి మాట్లాడుతున్నావు ఏది నన్ను చూడనీయి” అని దగ్గరకు వచ్చి విశాల చెయ్యి పట్టుకున్నాడు. విశాల శరీరం గజగజ వణికి సిగ్గుతో తలవంచుకొని “శారీరికమైనది కాదు డాక్టరు గారు మానసికమైనది” అంది. సనల్ చెయ్యి వదలి పెట్టలేదు. “మానసికంగా నువ్వు చింతించవలసినదేముంది? అన్నీ ఆలోచించే నువ్వు నిర్ణయానికి వచ్చేవు కదా?” అన్నాడు. “నేను దానిని గురించి మాట్లాడటం లేదు సనల్ బాబూ?” అంది మెల్లగా విశాల సనల్