మూడు రంగుల ఇంద్రధనుస్సు

(11)
  • 18k
  • 4k

అది చెన్నై లో లయోలా డిగ్రీ కాలేజీ ఆవరణ. హరిణి కాలేజీ లో మొదటి రోజు భయం భయం గా అడుగు పెడుతుంటే, సుడిగాలి లా ఒక ఫెరారీ కారు ఆమె దగ్గర లో వచ్చి ఆగింది. బ్రాండెడ్ దుస్తులు వేసుకుని దర్జా గా ఉన్న ఒకతను కారు దిగాడు. అతని కారు, వస్త్ర ధారణ అతను శ్రీమంతుల బిడ్డ అని చెప్పకనే చెబుతున్నాయి. ఫెరారీ కారు కమర్షియల్ లో లాగా అమ్మాయిలు షాక్ లో ఉండిపోయారు. హరిణి మాత్రం ఇవేవీ పట్టనట్లు తల వంచుకొని క్లాస్ రూమ్ లోనికి వెళ్ళి పోయింది. కొద్ది సేపట్లో అతను హరిణి క్లాస్ రూమ్ లోనే ప్రత్యక్షమయ్యాడు. అతని తో పరిచయం కోసం క్లాస్ లోని వారు ఆసక్తి కనకనబరచటం ఒక కంట గమనిస్తూనే ఉంది. ఒక నెల అయ్యాక ల్యాబ్ గ్రూప్ లు ప్రకటించారు. మొదటి రోజు ఫిజిక్స్ ల్యాబ్ కు వెళ్ళిన