మామూలు అదృష్టవంతులు కాదు

  • 20.9k
  • 4.8k

2019 మే నెల, విశాఖపట్నం అశోక్ నగర్ కాలనీ 3వ వీధిలో 4 ఇల్లులు ఉన్నాయి. మొదటిది విక్కీ వాళ్ళ ఇల్లు. రెండవది లక్కీ వాళ్ళ ఇల్లు. మూడవది మిక్కీ వాళ్ళ ఇల్లు. నాలుగవది ట్రీక్కీ వాళ్ళ ఇల్లు.విక్కీ, మిక్కీ అబ్బాయిలు.లక్కీ, ట్రీక్కీ అమ్మాయిలు. నలుగురు చిన్ననాటి నుంచి ప్రాణ స్నేహితులు. అశోక్ నగర్ కాలనీ లోనే పుట్టి పెరిగారు. నలుగురు చిన్ననాటి నుండి ఒకే పాఠశాల ఒకే తరగతి. 9వ తరగతి పూర్తి చేసి ఇప్పుడు వేసవి సెలవులను ఆస్వాదిస్తున్నారు. నలుగురికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఒక రోజు ఉదయం విక్కీ వాళ్ళ నాన్న విక్కీతో"అరేయ్ విక్కీ! ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి మనం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరాలి. అత్తయ్య ఫోన్ చేశారు"అంటాడు. అప్పుడు విక్కీ మనసులో "ఇది ఏంటి! Holidays మొత్తం క్రికెట్ ఆడుకోవాలి అనుకున్నాము కదా! ఇప్పుడు ఊరెళితే బానే ఉంటది. కానీ క్రికెట్