ఆది పిత - 2

  • 16k
  • 3.6k

దాదా ప్రతి నిత్యం గీతా పఠనం చేసేవారు. ఆ తరువాతే తన దినచర్య ప్రారంభించేవారు. వారు అమర్ నాధ్ , బద్రీనాధ్, ప్రయాగ,కాశీ, .... వంటి యాత్రలు ఎంతో భక్తి శ్రద్ధలతో చేశారు. వారికి గురువులన్నా సాధువులన్నా అపార గౌరవం. దాదాకు పన్నెండుగురు గురువులు ఉండేవారు. వారందరి పట్లా దాదా అచంచలమైన భక్తి,విశ్వాసాలను ... గౌరవ మర్యాదలను కలిగి ఉండేవారు. వారి రాక సందర్భంగా.... స్వాగత సత్కారాల కోసం.... అలాగే,వసతి ఏర్పాట్ల కోసం ఆ రోజుల్లోనే లక్షల రూపాయలు ఏ మాత్రం వెనకాడకుండా వెచ్చించేవారు. వారి ప్రతి మాటనూ ఆజ్ఞగా తలచి తక్షణమే శిరసావహించేవారు. దాదా ఇంట్లో ప్రతి రోజూ సత్సంగం జరుగుతుండేది. అందులో దాదా విధిగా హాజరయ్యేవారు. దాదా తన కుమార్తెల వివాహాలను కూడా భక్తి ప్రపత్తులు కల వారి కుమారులతోనే చేశారు... ఆ సందర్భంగా ఇచ్చే కానుకలతోపాటు భగవద్గీతను ఒక చిన్న వెండి మందిరం లో ఉంచి బహూకరించేవారు.